మహారాష్ట్ర పుణెలో పార్కింగ్ చేసిన బస్సులో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులోనిందితుడు రామ్‌దాస్ (36)ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాందాస్ యువతిపై అత్యాచారం చేసిన బస్సులో వందల సంఖ్యలో కండోమ్‌లు, మహిళల లోదుస్తులను పోలీసులు గుర్తించారు. దీంతో ఇంకా ఎంతమందిపై ఇలాంటి దారుణాలకు పాల్పడ్డాడో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.