తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. బాలన్ అనే వ్యక్తి చనిపోయిన తన తల్లి శివగామి(65) మృతదేహాన్ని 18 కిలోమీటర్లు సైకిల్‌పై తీసుకెళ్లాడు. మీనావంకులానికి చెందిన శివగామికి ముగ్గురు కొడుకులు. ఆమె తన కుమారుడు బాలన్ వద్ద నాలుగేళ్లుగా ఉంటోంది. ఇటీవల తల్లి అనారోగ్యం బారినపడటంతో తిరునల్వేలిలోని ఆస్పత్రిలో చేర్పించాడు. డిశ్చార్జి అనంతరం సైకిల్‌పై తెస్తుండగా ఆమె మరణించింది.