సల్మాన్ ఖాన్‌తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది సోనాక్షి సిన్హా. దబాంగ్ మూవీలో నటించి మంచి విజయం అందుకున్నారు. అయితే తాజాగా తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుధీర్ బాబు అప్ కమింగ్ మూవీ జటధరలో సోనాక్షి నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కాగా ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 8 నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.