సూడాన్‌లో జరిగిన సంఘర్షణలో ఒక సంవత్సరం వయస్సు ఉన్న పిల్లలు కూడా సాయుధ పురుషుల చేతుల్లో అత్యాచారానికి గురయ్యారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అత్యాచారాల స్థాయి నమోదైన కేసుల కంటే ఎక్కువగా ఉందని వెల్లడించింది. 2024 ప్రారంభం నుంచి దాదాపు 221 పిల్లలపై అత్యాచార కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఆ కేసుల్లో, ప్రాణాలతో బయటపడిన వారిలో బాలికలు 66 శాతం, బాలురు 33 శాతం మంది ఉన్నట్లు తెలిపింది.