దక్షిణ కొరియా నటుడు పార్క్ మిన్ జే గుండెపోటుతో మృతి చెందారు. నవంబర్ 29న ఆయన మృతి చెందినట్లు దక్షిణ కొరియా వార్తా ఏజెన్సీ పేర్కోంది. 32 ఏళ్ల జే చైనాలో ప్రయాణిస్తున్నపుడు గుండెపోటుకు గురయ్యారు. అయితే జేకి చైనాకు బయలుదేరే ముందు పెద్ద ఆరోగ్య సమస్యలేమి లేవని కూడా ఏజెన్సీ పేర్కొంది. లిటిల్ వుమెన్, కాల్ ఇట్ లవ్, ది కొరియా-ఖైతాన్ వార్ వంటి కొరియన్ డ్రామా సిరీస్ల ద్వారా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడని తెలిపింది.