'జోడి' చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేసింది సౌత్ క్వీన్ త్రిష. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రభాస్ వర్షం సినిమాతో ఆమెకు పెద్ద హిట్ వచ్చింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, సైనికుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ, బుజ్జిగాడు సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. 96, పొన్నియిన్ సెల్వన్, లియోతో సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి సక్సెస్ సాధించింది.