ఐపీఎల్ లో భాగంగా గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచులో హైదరాబాద్ హిట్టర్స్ చెలరేగి ఆడితే పాత రికార్డులు బద్దలై కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. రాజస్థాన్‌తో ఆడిన మొదటి మ్యాచులో SRH 300కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ విజృంభిస్తే నేటి మ్యాచులో 300 స్కోరు చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.