కొలికపూడిపై చర్యలు తీసుకుంటాం: పల్లా శ్రీనివాస్

62చూసినవారు
కొలికపూడిపై చర్యలు తీసుకుంటాం: పల్లా శ్రీనివాస్
AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కు సొంత పార్టీ నేతల నుంచి నిరసన సెగ తగిలింది. కొలికపూడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరువూరు టీడీపీ కార్యకర్తలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఆ ఎమ్మెల్యే తమకు వద్దంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందిచారు. కార్యకర్తలను సముదాయించి పార్టీ గీత దాటిన కొలికపూడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్