తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే అయిదింటితో కూడుకున్నదే పంచాంగం. ఉగాది నాటి ఆచారాల్లో పంచాంగ శ్రవణం ప్రత్యేకమైంది. ఇందులో కొత్త సంవత్సరంలో సంభవించే ఫలితాలను వివరిస్తారు. సంవత్సరంలో జరగబోయే శుభాశుభాలు, లాభనష్టాలు, ఆదాయ కందాయ ఫలితాలు, వర్షపాత, పంటల వివరాలు, వ్యక్తుల జాతక ఫలితాలు.. ఒకటేమిటి అనేకానేక విషయాలు పంచాంగ శ్రవణం ద్వారా తెలియజేస్తారు. పంచాంగ శ్రవణం చేసినవారికీ, విన్నవారికీ నవగ్రహానుగ్రహం లభిస్తుంది.