భారీ గాలులకు స్టేజ్ కూలి ఐదుగురి మృతి (వీడియో)

76చూసినవారు
మెక్సికోలో ఓ పార్టీ అధ్యక్ష అభ్యర్థి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో విషాదం చోటుచేసుకుంది. శాన్ పెడ్రో గార్జా గార్షియా పట్టణంలో బుధవారం సిటిజన్స్ మూవ్ మెంట్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గాలి దుమారం చెలరేగింది. ఈదురు గాలుల తీవ్రతకు స్టేజ్ ఒక్కసారిగా కూలింది. భారీ లైట్ సెట్టింగ్ లన్నీ కింద ఉన్న వారిపై పడిపోయాయి. దీంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్