'పిన్నెల్లి ఎక్కడ దాక్కున్నాడో చెప్పాలి'

69చూసినవారు
'పిన్నెల్లి ఎక్కడ దాక్కున్నాడో చెప్పాలి'
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. దీనిపై మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి స్పందించారు. రెండు గంటల్లో మాచర్ల వస్తానని మొన్న ఒక వీడియోలో అసభ్య దూషణలు చేసిన పిన్నెల్లి, ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో చెప్పాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సరిహద్దుకు అటువైపు, ఇటువైపు అతడు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు.. అతడు మాట్లాడిన మాటలకు దేవుడు సరైన స్క్రిప్టు విధించాడేమో అనిపిస్తోంది అని జూలకంటి అన్నారు.

సంబంధిత పోస్ట్