పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారి ‘హరిహర వీరమల్లు’తో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ విజయవాడలో ప్రారంభమైంది. అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు 200 మంది ఆర్టిస్టులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక, ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కానుంది.