ఓ రష్యన్ మత్సకారుడు గల్ఫ్‌లో చేపలు పడుతుండగా.. అతడి వలకు ఒక వింతైన ఆకారంలో ఉన్న జీవి చిక్కుకుంది. ఇది చూడటానికి ఏలియన్ ముఖం మాదిరి ఉంది. ఇది నలుపు రంగులో ఉబ్బెత్తుగా భయంకరంగా ఉంది. ఈ జీవిని అతడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.