యువతిపై వీధి కుక్కల దాడి (VIDEO)

68చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. జ్వాలాపూర్‌లోని కసబన్ ప్రాంతంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తొన్న ఓ యువతిపై వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి. యువతి పారిపోవడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. చివరికి ఆ యువతిని పీక్కు తినేందుకు ప్రయత్నించాయి. ఇంతలో కేకలు విన్న స్థానికులు వచ్చి ఆ కుక్కలను తరిమివేయడంతో ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

సంబంధిత పోస్ట్