విమానం బాత్రూంలో ఆత్మహత్యాయత్నం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

594చూసినవారు
విమానం బాత్రూంలో ఆత్మహత్యాయత్నం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
తైవాన్‌కు చెందిన ఇవా ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం గాలిలో ఉండగానే ఓ ప్రయాణికుడు బాత్రూంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బ్యాంకాక్‌ నుంచి లండన్‌ వెళ్లే విమానంలో ఓ వ్యక్తి బాత్‌రూమ్‌కి వెళ్లి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. సిబ్బంది అనుమానాస్పదంగా దాన్ని తెరవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో హీత్రూ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్