నీట్ కౌన్సెలింగ్‌పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

77చూసినవారు
నీట్ కౌన్సెలింగ్‌పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
NEET ప్రవేశపరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారని.. దీనిపై సమాధానం చెప్పాలంటూ NTAకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈలోగా జరగనున్న NEET కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. పరీక్షను రద్దు చేయడం అంత సులువు కాదని అభిప్రాయపడింది. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.