కోలీవుడ్‌లో తనకు ఇష్టమైన హీరో సూర్య అని తెలుగు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. తండేల్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ్‌లో సూర్యతో నేరుగా ఓ సినిమా చేస్తానని అని,చందు మొండేటి ఇప్పటికే సూర్యతో చర్చలు కూడా జరిపినట్లు వెల్లడించారు. తండేల్ మూవీ విడుదల కాగానే సూర్య మూవీపై దృష్టి సారిస్తానని అన్నారు. అయితే తండేల్ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 7న విడుదల కానుంది.