బీబీనగర్: ఓ మహిళపై మరో మహిళ గొడ్డలితో దాడి

580చూసినవారు
యాదాద్రి: బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామ శివారులో శుక్రవారం దారుణం జరిగింది. స్థానికుల వివరాలిలా. ఉపాధి హామీ పనులకు వెళుతుండగా గుండెబోయిన మౌనిక అనే మహిళ గుండెబోయిన సోనిపై గొడ్డలితో దాడి చేసింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కొన్ని నెలలుగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్