యాదగిరిగుట్టలోని నల్ల చెరువులో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైనట్లు ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చెరువు దగ్గరకు వెళ్లి శవాన్ని బయటికి తీయించారు. ఈ మృతదేహాన్ని మగ వ్యక్తిగా గుర్తించినట్లు, కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు తెలిపారు. వయసు 40 నుంచి 45 సంవత్సరాల వరకు ఉండవచ్చని, మోహం ఉబ్బిపోయిన స్థితిలో ఉండి గుర్తుపట్టలేనంతగా ఉందని, శరీరంపై కేవలం నలుపు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు.