రోడ్డు పై యువకుల వీరంగం

558చూసినవారు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపురం చర్చిరోడ్డులో యువకులు వీరంగం సృష్టించారు. పుట్టినరోజు వేడుకల్లో తలెత్తిన వివాదం కారణంగా శుక్రవారం ఓ యువకుడి పై మరి కొంతమంది యువకులు కలిసి దాడి చేశారు. దాడి సంఘటనను వీడియో తీయడంతో అది వైరల్ గా మారింది. కొద్దిరోజుల క్రితం గంజాయిమత్తులో యువకులు దాడిచేసిన ఘటనతో పాటు ప్రైజ్ మనీ పంపిణి విషయంలో సైతం ఇరు గ్యాంగ్ ల మధ్య రోడ్ల పై దాడి ఘటనలు జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్