గౌడ కులస్తుల సమావేశం విజయవంతం

58చూసినవారు
గౌడ కులస్తుల సమావేశం విజయవంతం
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణం కోసం ఆదివారం గ్రామంలోని గౌడ కులస్తులు ఏర్పాటు చేసిన సమావేశం విజయవంతం అయింది. ఎన్నో సంవత్సరాల ఉత్కంఠకు ఇవాళ తెరపడింది. గౌడ కులస్తులందరు గుడి నిర్మాణం కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేసి కమిటీని వెయ్యడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామంలోని గౌడ కులస్తుందరు పాల్గొని సంతోషం వ్యక్తం చేసారు.

సంబంధిత పోస్ట్