కలకోవ గ్రామం వద్ద ద్విచక్ర వాహనం దగ్ధం

11438చూసినవారు
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామం వద్ద ఆదివారం ద్విచక్ర వాహనం దగ్ధం అయింది. రోడ్డు పక్కన తాటి చెట్టు వద్ద ఉన్న ఈ వాహనం నుండి ఒక్కసారిగా మంటలు లేచి వచ్చాయి. ప్రమాద వశాత్తు మంటలు చెల రేగాయా లేక ఎవరైనా ఉద్దేశ్య పూర్వకంగా తగల బెట్టారా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా బైకు తగలబడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతున్నాయి.

సంబంధిత పోస్ట్