కోదాడ: టీడీపి ఆద్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి

83చూసినవారు
కోదాడ: టీడీపి ఆద్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి
తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహానీయుడు ఎన్టీఆర్ అని కోదాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ ఓరుగంటి ప్రభాకర్ అన్నారు. శనివారం ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా మున్సిపాలిటీ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అల్పాహారాన్ని పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎర్నేని బాబు, డాక్టర్ సుబ్బారావు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్