శ్రీ రాఘవేంద్ర ఆర్టి క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న సర్కార్ శివ వెబ్ సిరీస్ చిత్రం ఫైటింగ్ సన్నివేశాలు శని వారం కోదాడ పట్టణ ప్రధాన రహదారి పై లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా నటుడు బుడిగం నరేష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఇతివృత్తాంతంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాగా చిత్రంలో దర్శకుడు కాసాని శివ, నిర్మాతలు గుడిగం లిఖిత్ కుమార్, పూజిత్ కుమార్ అని తెలిపారు.