ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ జిల్లాల రాష్ట్ర అధ్యక్షులు చింతబాబు మాదిగ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో బైక్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈనెల 19న మేడి పాపన్న మాదిగ నాయకత్వంలో నిర్వహించే మాదిగ గర్జన విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెటి లక్ష్మణ్, నియోజకవర్గ ఇన్చార్జి బాణాల అబ్రహం, ఏర్పుల చిన్ని, గంధం యాదగిరి, కంభంపాటి శ్రీను, గంధం పాండు ఉన్నారు.