ప్రకృతి వైపరీత్యంతో భారీ వర్షాలతో వచ్చిన వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి అన్నారు. భారీ వర్షాల కారణంగా కోదాడ మున్సిపాలిటీ లో 34వ వార్డులో మృతి చెందిన నాగం మురళీకృష్ణ భార్య నాగం రోజాకి, 31వ వార్డుకి చెందిన యరమళ్ళ వెంకటేశ్వర్లు భార్య ఈశ్వరమ్మకి చెరో 5 లక్షల రూపాయల చెక్ లను ఆమె జిల్లా కలెక్టర్ తో కలిసి కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు అందజేశారు.