ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపాధ్యాయులు గుణాత్మక విద్యను అందించాలని అనంతగిరి మండల విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు. బుధవారం అనంతగిరి మండలం శాంతినగర్ లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. కాంప్లెక్స్ సమావేశాల్లో అవగాహన చేసుకున్న అంశాలను తరగతి గదుల్లో అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో హెచ్ఎం సిహెచ్ పురుషోత్తమరావు, రిసోర్స్ పర్సన్ లు ఉన్నారు.