మాట వినలేదని గ్రామ బహిష్కరణ.. దంపతుల ఆత్మహత్యాయత్నం (వీడియో)
ఆస్తి పంపకాల్లో చెప్పినమాట వినలేదని గ్రామ బహిష్కరణ చేయడంతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. యాదాద్రి జిల్లా రామన్నపేట్ మండలం మునిపంపుల గ్రామంలో ఆస్తి పంపకాల్లో గ్రామపెద్దలు చెప్పినట్లు వినకపోవడంతో రమేష్, వసంత దంపతులను గ్రామ, కుల బహిష్కరణ చేశారు. దీంతో మనస్తాపంతో పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితులు, బంధువులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.