కోదాడ పీఏసీఎస్ కార్యాలయంలో గురువారం స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా సొసైటీ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి పతాకాన్ని ఆవిష్కరించారు. సమరయోధుల ఆశయాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేష్, ప్రభాకరరావు, పార్వతి, రమాదేవి, గోబ్ర, చంద్రమౌళి, సీఈవో మంద వెంకటేశ్వర్లు, రైతులు బెజవాడ రామకృష్ణారెడ్డి, రాములు సత్యనారాయణ కోటయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ సంపెట ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు.