వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవార కోదాడ మండలం తొగర్రాయి గ్రామం లో వరద వల్ల తెగిపోయిన రోడ్డు, బ్రిడ్జి, వరద ప్రభావం చూపిన ప్రతి బజారు లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రెండు గంటల పాటు పర్యటించి ప్రతి ఒక్కరి సమస్య విని వారందిరికి సహాయం చేస్తానని కలెక్టర్ అన్నారు. ముందుగా తెగిపోయిన బ్రిడ్జి ని పరిశీలించి రేపు ఉదయం కల్లా తాత్కాలింగా మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పంచాయతీ రాజ్ ఇంజనీర్ అధికారులను ఆదేశించారు. పూర్తిగా గాని, పాక్షికంగా కాని దెబ్బ తిన్న ఇండ్లను, వరద నీరు ఇంటిలోకి వచ్చిన సామాగ్రి కొట్టుకోనిపోయిన ఇండ్లను, నీట మునిగిన పంటలు, చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలను లెక్కించుటకు గురువారం ఉదయం 9 గంటల నుండి హౌజ్ టూ హౌజ్ సర్వే జరరుగుతుందని అక్కడికి వచ్చిన అధికారులకు మీకు కలిగిన నష్టం తెలియపర్చాలని అధికారులు వాటిని రాసుకొని నివేదిక అందించగానే ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుండి తేరుకోవ డానికి అధికారులకు గ్రామ ప్రజలు, యువత సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమం లో ఆర్ డి ఓ సూర్యనారాయణ, డిప్యూటీ డి యమ్ హెచ్ ఓ నిరంజన్, ఎ యన్ యమ్ లు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, యువత, తదితరులు పాల్గొన్నారు.