నడిగూడెం మండల విద్యాధికారిగా మండలంలోని రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్ రావు బుధవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అందరి సహకారంతో విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాగా నూతనంగా ఎంఇఓ బాధ్యతలు చేపట్టిన ఉపేంద్రర్ రావును యూటీఎఫ్, పిఆర్టీయు, ఎస్టీయూ, టీపిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు అభినందనలు తెలిపాయి.