సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఓ మటన్ దుకాణం వద్ద వేలాడదీసిన మేక మాంసాన్ని కుక్కలు తింటున్న సంఘటన కలకలం రేపుతుంది. యజమానులు నిర్లక్ష్యంగా దుకాణాలను వదిలి వెళ్లడంతో మనుషులు తినే మాంసాన్ని కుక్కలు పీక్కొని తింటున్నాయి. ఇదే మేక మాంసాన్ని తిరిగి దుకాణదారుడు వినియోగదారులకు అమ్ముతున్నాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో పొక్కడం తో మున్సిపల్ అధికారులు దుకాణదారునిపై జరిమానా విధించినట్లు సమాచారం.