ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ బోడపూడి సత్యనారాయణ సోమవారం అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, నిజాయితీపరులైన నాయకులను ఎన్నుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి గ్రామ ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కులో పాల్గొంటున్నారని అన్నారు.