యుటిఎఫ్ టిఎస్ జిల్లా మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
మునగాల మండల కేంద్ర పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నారాయణ గూడెంలో గురువారం యుటిఎఫ్ టీఎస్ జిల్లా మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 29, 30, తేదీలలో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయవలసిందిగా కోరారు.