రియాక్టర్ పేలి చెలరేగిన మంటలు

60చూసినవారు
రియాక్టర్ పేలి చెలరేగిన మంటలు
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని శ్రీపతి కంపెనీలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. Q3 బ్లాక్ లో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. రియాక్టర్ నుండి గ్యాస్ లీక్ కావడానికి గమనించిన అక్కడి కార్మికులు, సిబ్బంది బయటకు వెళ్లిపోయారు. తర్వాత పేలుడు జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

సంబంధిత పోస్ట్