జమిలి ఎన్నికల విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదని.. నల్గొండ జిల్లా సిపిఎం కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 1, 2, 3 వార్డులలో జరుగుతున్న సిపిఎం శాఖ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. 2029 నుంచి ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్లో ప్రవేశపెట్టడం పెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు.