సూర్యాపేట జిల్లాలో నేడు గురువారం జరగాల్సిన గురుపూజోత్సవం సందర్భంగా నిర్వహించే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఒక ప్రకటన లో తెలిపారు. తిరిగి మరో తేదీన ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.