సూర్యాపేట కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఇంకా ప్రారంభం కాలేదు అని అన్నారు. ముఖ్యమంత్రితో సహా ఏ ఒక్క మంత్రికి రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి, బాధ్యత లేదు అని గుర్తు చేశారు. జల్సాల కోసం మంత్రులు పర్యటనలు చేస్తున్నారు అని అన్నారు. హామీలు నెరవర్చలేక సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు అన్నారు.