ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో స్థానిక 25వ వార్డులో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్థానిక వార్డు కౌన్సిలర్ ఆకుల కవిత లవకుశ ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులు పాల్గొన్నారు.