స్థానిక శాసనసభ్యులు మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆశీస్సులతో సూర్యాపేటకు చెందిన జిజెఆర్ లెవెన్ టీమ్ పలు క్రికెట్ టోర్నమెంట్ లో సత్తా చాటుతూ వస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్టం ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కొండమంజులూరు ఛాంపియన్షిప్ ట్రోఫీ 2022 కి జిజెఆర్ లెవెన్ టీమ్ ఎంపికైంది. 16 మంది సభ్యులతో కూడిన జిజెఆర్ లెవెన్ టీమ్ ఈ నెల 6న ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరనుంది. ఈ సందర్బంగా టీమ్ సభ్యులకు జెర్సీలు అందచేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ పుట్టా కిషోర్, ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలొనే కాదు క్రీడల్లో కూడా సూర్యాపేట నియోజకవర్గాన్ని అగ్రభాగాన ఉంచాలనేది మంత్రి జగదీష్ రెడ్డి లక్ష్యమని, క్రీడాకారులు కూడా మంత్రి సహకారంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సూర్యాపేటకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. యువతకు, క్రీడాకారులకు మంత్రి జగదీష్ రెడ్డి సహకారం ఎప్పుడు ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆరెస్ పార్టీ ఆర్గనైసింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్ రెడ్డి , టి ఆర్ యస్ యువజన నాయకులు ఈద ప్రవీణ్, అయ్యన్న, కొమ్ము ప్రవీణ్, రుద్రరాపు నాగరాజు, టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.