సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ గంగ దేవమ్మ గుడి దగ్గర ఇంటి అవసరాల నిమిత్తం అనుమతులు లేకుండా నల్ల కోసం గుంతలు తవ్వి వాటిని పూడ్చ కుండా వదిలేశారు. ఆర్. అండ్. బి అధికారులు స్పందించి గుంతలు పూడ్చకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే తవ్విన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.