ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని, ప్రజలంతా శాంతి సామరస్యాలతో ఎదుటివారిపై జాలి కరుణ చూపాలని ఏసుక్రీస్తు చాటి చెప్పాడని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 35వ వార్డు కౌన్సిలర్ జ్యోతి శ్రీవిద్య కరుణాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని స్థానిక సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో భారీ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.