గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వెనక బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ రూ. 10 వేల కోట్ల కంటే ఎక్కువ జరగలేదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నవన్నీ కాకి లెక్కలు, అబద్ధపు మాటలే అన్నారు.