సూర్యాపేట జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న పోలీసు అమరవీరుల కుటుంబాలను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు బుధవారం పట్టణ సీఐ రాజశేఖర్ సందర్శించి పరామర్శించారు. పోలీసు అమరుల కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. పోలీసు కుటుంబాల సంక్షేమానికి అధికారులు కృషి చేస్తారు అని పట్టణ ఇన్స్పెక్టర్ తెలిపినారు. పోలీసు అమరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు ఘటించారు.