మోతె మండలం మామిళ్లగూడెంలోని శ్రీ వెంకటేశ్వర విద్యానిలయంలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన సయ్యద్ ఫాతిమా-సందాని ని పాఠశాల యాజమాన్యం సోమవారం ఘనంగా సత్కరించారు. పాఠశాల కరస్పాండెంట్ జానీమియా సరికొత్త ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగస్తులకు దీటుగా వేతనం పెంచుతూ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సత్కరించి, బోనస్ వేతనంతో సహా అవార్డును అందజేశారు. ఈ వేడుకల్లో చైర్మన్ మీరాంబి, కరస్పాండెంట్ జానిమియా, అకాడమిక్ డీన్ అజహరుద్దీన్, ప్రిన్సిపాల్ సఫియా, డైరెక్టర్ సయ్యద్ మియా, అబ్దుల్ అజాద్, తదితరులు పాల్గొన్నారు.