మహానుభావుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలి

66చూసినవారు
మహానుభావుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలి
సమాజ మార్పు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలని మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా గురువారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మట్టిపల్లి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.