వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్ జి టి లకు ఓటు హక్కు కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పర్వతం సంధ్యారాణి, రమేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండలంలో పలు పాఠశాలల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ సభ్యత్వం నిర్వహించి వారు మాట్లాడారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అగ్రస్థానంలో ఉందన్నారు.