రైతులకు కాంగ్రెస్ పార్టీ నమ్మకద్రోహం చేసిందని తుంగతుర్తి మండల బీ. ఆర్. ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీ. ఆర్. ఎస్ నాయకులు గుండగాని రాములు గౌడ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వాగ్దానాలలో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని తెలియజేశారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన రైతుబంధు ఇవ్వడంలేదని తెలిపారు.