అభివృద్ధిని ఎమ్మెల్యే మందుల సామేల్ కాలరాస్తుండు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తడకమళ్ళ రవికుమార్ అన్నారు. తుంగతుర్తిలో బుధవారం మాట్లాడుతూ ఎమ్మెల్యే మందుల సామెల్ తుంగతుర్తి నియోజకవర్గం అంటే మోత్కూర్, శాలిగౌరారం, అడ్డగూడూరు మండలాలు మాత్రమే అనుకుంటున్నారని రూలర్ డెవలప్మెంట్ ఫండ్ కింద నియోజకవర్గానికి 15 కోట్లు మంజూరు అయితే అడ్డగూడూరు 9 కోట్లు శాలిగౌరారం మండలానికి 6కోట్లు కోట్ల కేటాయించారు అన్నారు.