గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితులు పెద్దపల్లికి చెందిన సంపత్‌పై ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సంపత్‌తో పాటు మరో ఏజెంట్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కస్టడీలో ఉన్న సంపత్ గురువారం రాత్రి మృతిచెందాడు. ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు చిత్రహింసలు పెట్టడంతోనే మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.